తీరని దాహం ఈ రాతిరి
తీరని దాహం ఈ రాతిరి
నీ తీరని దాహాలను ఈ రాతిరి భరిస్తోంది
ఆ తీయని భావాలను నా మౌనం లిఖిస్తోంది
అందమైన ప్రేమ కథలు చెప్పలేదు నీవెపుడూ
నువు రాయని నీ కథలో ఈ సారిక నటిస్తోంది
తాళలేని తారకాల ఎదలయలకు శ్రుతిలయగా
వెలివేసిన విరహాలను సిరి వెన్నెల వరిస్తోంది
దేహవీణ తంత్రులపై మోగుతోంది గమకమొకటి
అణువణువున అనుభవాల మధురాక్షరి రచిస్తోంది
తలగడగా నలుగుతున్న తపనలేంటి ఓ సత్యా!
పెరుగుతున్న తహతాహలకు ఈ దేహం జ్వలిస్తోంది

