STORYMIRROR

Ramesh Babu Kommineni

Romance

4  

Ramesh Babu Kommineni

Romance

తీరికలేని వలపు

తీరికలేని వలపు

1 min
350

తీరమే దాటుతున్నదే తీరికా లేని ఆ వలపే


భారమై మీటుతున్నదే ఎదనే తిప్పీ మలుపే 


తోరణమై అల్లుకున్నదే తొలకరై తనువునూ


కారణమే చెప్పదు కదిపేసి ప్రతి అణువునూ


వలపంటే ఝలకేలే హృదయానికి సైతమూ


కలల పంటే కాలానికి కలిసొచ్చిన హితమూ


తీరమే దాటుతున్నదే తీరికా లేని ఆ వలపే


భారమై మీటుతున్నదే ఎదనే తిప్పీ మలుపే 


లాహిరిలో లంగరే కుదరక కుడీ ఎడమవునే


పోకిరిలా తలపు పొటమిరించి పడవేయునే 


లాహిరిలో లంగరే కుదరక కుడీ ఎడమవునే


పోకిరిలా తలపు పొటమరించి పడవేయునే


ఎడబాటే ఎరుగని ఎలమిలో ఏదో జరిగెనూ


తడబాటే తారసిల్లి తనువులో అదేకరిగెనూ 


తీరమే దాటుతున్నదే తీరికా లేని ఆ వలపే


భారమై మీటుతున్నదే ఎదనే తిప్పీ మలుపే 




జీవితమంతా జీ హుజూరే అనాలిగా ప్రేమకే 


కాగితమంతా రాసి కలలే పంచాలిగా లేమకే 


జీవితమంతా జీ హుజూరే అనాలిగా ప్రేమకే


కాగితమంతా రాసి కలలే పంచాలిగా లేమకి


జైకొట్టి జోకొట్టాలి పనిలో పనిగా ఆ ప్రమదనే


ఊకొట్టి ఊసులతో మెప్పించాలి తన మదినే 


తీరమే దాటుతున్నదే తీరికా లేని ఆ వలపే


భారమై మీటుతున్నదే ఎదనే తిప్పీ మలుపే 



Rate this content
Log in

Similar telugu poem from Romance