తెలియకనే
తెలియకనే
మాట ఎగిరి పడుతున్నది..ముద్దంటే తెలియకనే..!
పాట ఆగి పోతున్నది..వలపంటే తెలియకనే..!
సొంతమైన వసంతాల..వేడుకలో లేనిదెవరు..
తోట పూలు పూస్తున్నది..మనసంటే తెలియకనే..!
ఏ రుతువుకు ఆ రుతువే..ఒక మాయా పరవశమే..
ఆశ చిగురు వేస్తున్నది..బ్రతుకంటే తెలియకనే..!
అక్షరాల ఆయుధాలు..విసిరేయక శాంతి ఎచట..
కల ఊయల అవుతున్నది..మెఱుపంటే తెలియకనే
ఏ మబ్బుకు ఆ మబ్బే..చేయును కద ప్రేమతపము..
కడలి ఎదురు చూస్తున్నది..చినుకంటే తెలియకనే..!

