STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

తెలిసేనా

తెలిసేనా

1 min
2


ప్రశాంతతే ప్రసాదముగ..తలచుతీరు తెలిసేనా..!

'నీ మనసే'! దానినలా..నిలుపుతీరు తెలిసేనా..!


ఎవ్వరినో ఏమో అని..సాధించే దేమున్నది.. 

నోటి దురుసుతనం తోటి..బ్రతుకుతీరు తెలిసేనా..!


సాయమేదొ చేయలేని..మంచితనం గొప్పేమిటి.. 

అసలుచెలిమి వనమేదో..పెంచుతీరు తెలిసేనా..!


శ్రమచేయక ఫలమేదో..ఆశించే పనేమిటో.. 

దు:ఖంతో గొడవపడితె..సుఖముతీరు తెలిసేనా..! 


స్పర్దలేక వృద్ధిలేదు..వ్యాపారం ఏదైనా.. 

చంపుకు తిను ముచ్చటలో..చదువుతీరు తెలిసేనా..!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance