STORYMIRROR

VENKATALAKSHMI N

Fantasy Inspirational Others

4  

VENKATALAKSHMI N

Fantasy Inspirational Others

స్వంత ఇంటి కల

స్వంత ఇంటి కల

1 min
256

అంశం:స్వంత ఇంటి కల

************†********

ఎన్ని అవస్థలో

బ్రతకడానికి..

ఎన్ని పాట్లో

గుక్కెడు బువ్వ కు..

కాలే కడుపు చేతబట్టి

పొట్ట కూటి కొరకు

పొరుగూరికి పరుగులు..

రెక్కలు ముక్కలయ్యే

కష్టాల వెతలు..

మూట ముల్లె వెనుక

అంతులేని కథలు..

బతుకంతా చిరుగుల బొంతలు..

కదం తొక్కుతున్న కరువు

కరుణ లేని కర్కశ కరోనా..

మారని అతుకుల గతుకులు

కన్నీటి కొలనులో

తేలుతున్న తామరలే..

ఇన్ని వెతల నడుమ

ఆశాజీవి ఆశలు ఎండమావేనేమో

స్వంత ఇంటి కల కలయేనేమో!



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Fantasy