స్వచ్ఛమైన మనసు
స్వచ్ఛమైన మనసు
స్వచ్ఛమైన మనసులోన మలినమెలా చేరునో
ఎదలోపల పూదోటను పెంచుటెలా నేర్చునో..
సంయమనం కోల్పోతే గాడితప్పదా బ్రతుకు
చిరునవ్వులు జారవిడువ బంధమెలా సాగునో
ప్రేమలేని హృదయమేగ కఠినమైన పాషాణం
సాత్వికమను సహజగుణం మనిషినెలా వీడునో
క్రమశిక్షణ లేనివాడు తాడుతెగిన పతంగమె..
వ్యర్ధమైన పనులతోటి కాలమెలా గడుపునో
చిత్తశుద్ధి లేకుంటే ఫలియించదే కార్యం..
విలువలకై పాటుపడక లక్ష్యమెలా పొందునో
జీవితం నేర్పుతుంది పరీక్షిస్తు పాఠాలు
నడవడికను దిద్దుకోక బ్రతుకునెలా గెలుచునో
నైపుణ్యం వెలికితీసి మెరుగుపరచు కష్టాలు
సుజాతమై జీవింపక ప్రాణమెలా విడుచునో.

