సుందరి
సుందరి
నీ నవ్వులన్నీ పువ్వులై విరబూస్తుంటే
ఆ పూల వర్ణాల అందాలు చూడడానికి
ఈ నయనాలు చాలునా......
నీ నునునిగ్గుల బుగ్గలలో
సిగ్గులు మందారంలా ఎరుపెక్కుతుంటే
ఆ మందారాల మధురిమలు దర్శించడానికి...
చూసి తరించడానికి
ఒక్క ఎద చాలునా......
సరిపోవు భాషలెన్నున్నా
సరిపోవు భావనలెన్నున్నా.....
వర్ణించలేని
వర్ణించడానికి వీలుకాని.....
అభినవ
అద్వితీయ
సుందర
సువర్ణ
పారిజాత ప్రాయమా
కవులకందని అపురూపకల్పన
ఏ శిల్పి చెక్కని లావణ్యమా.....

