సుదీర్ఘ పయనం
సుదీర్ఘ పయనం
ముప్పది మూడు సంవత్సరాలు
సుదీర్ఘమైన మన జీవన తరంగాలు
ఎన్నో బరువులు మరెన్నో భారాలు
కాలు కదపనీయని అవాంతరాలు
పెద్దలతో అగచాట్లు పిల్లలతో ముచ్చట్లు
కాపురంలో చోటుచేసుకున్న ఇక్కట్లు
రేయి పగలు సంపాదనకై అగచాట్లు
పిల్లల చదువులు పెద్దల ఈతిబాధలు
ఆదుకున్న అమృతమయి అమ్మ చేతులు
అమ్మ చేతుల్లో నిశ్చింతగా పెరిగిన పిల్లలు
ఒక్కొక్కటిగా అధిగమించిన కష్టాలు
పెద్దమ్మాయి అండతో మారిన జీవితాలు
మారిన ఊరితో పాటు మారిన జాతకాలు
మన ఆడపిల్లలే మన జీవన ఆశాసౌధాలు
మనసున్న వ్యక్తిని చేపట్టిన పెద్ద అమ్మలు
అల్లుడు గారు కాదు అనుంగు పుత్రులు
అమ్మ దూరమైన విషాద దినములు
ధైర్యమిచ్చి ఆదుకున్న బంగారు తల్లులు
చిన్ని పెళ్లికి పెద్దమ్మాయి సహాయసహకారాలు
పెద్ద వారి ఆధ్వర్యంలో తీరిన బాధ్యతలు
ఇక మిగిలినవి శేష జీవితపు రోజులు
ఆదరించే కూతుళ్ళు అభిమానించే అల్లుళ్ళు
కావాలి ఆసరా ఆనలుగురి చేతులు
ఈ మాకోరిక తీర్చాలి ఆ దేవదేవులు