STORYMIRROR

Midhun babu

Classics Fantasy Inspirational

4  

Midhun babu

Classics Fantasy Inspirational

సృష్టి కి జీవం

సృష్టి కి జీవం

1 min
2


మనిషికి ప్రాణ వాయువునిచ్చి 

ఊపిరులూదిన మొక్క!.. 

జగతికి ఆహారమిచ్చి

జీవం నిలిపిన మొక్క!..  

జీవకోటికి ఆరోగ్యమిచ్చి

వైద్యానికి ఔషధమైన మొక్క!.. 


అభివృద్ధి అంటూ 

మారిన మనిషిని చూసి

దిగులు పడుతూ.. 

జాలిగా చూస్తోంది !.. 


కాలుష్యపు కోరలలో 

చిక్కుకుంటున్న 

అమాయక జీవులను

కాపాడుకొమ్మని సందేశమిచ్చింది! 


నేను నాటిన మొక్క ఆనందంతో

చిగురులు వేసి పులకరించింది!

పత్రాలతో పలుకరించింది!

మొగ్గలేసి మురిసిపోయింది!

నవ్వులన్ని పువ్వులలో నింపి 

పరవశించింది!

ఫలములిచ్చి..  

నావంక ఆశగా చూసింది.. 

ఏదో తెలియ చెప్పాలని!.. 

మరో మొక్కతో చెలిమి కలపమంది!

ఒక్కటేమిటి! ఎన్నో మొక్కలతో

తనకు స్నేహం చేయించాను!

పచ్చదనాన్ని పెంచే నా ప్రయత్నానికి

పుడమితో కలిసిన ప్రకృతి 

చల్లటిగాలుల ఊయలలూపింది

గగనం ఆనంద రావాలతో..  

నాపై ఆశీస్సుల చినుకులు చల్లింది! 



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics