సరంగు
సరంగు


తొలిపొద్దు వేకువతడు నాజీవితాన
ఊహలతెరలు దాటి నిజమై
నా కళ్ళముందు నిలిచాడుగా
చిక్కటి చీకటిలో నవ్వుల వెలుగులు పంచే
నక్షత్రాలు కాంతి అతడు
కలలా కరిగే ఆలోచనలను కమ్మటి దృశ్యాలుగా
నా ముందు పరిచాడుగా
జాలువారే జలపాతాలహోరు అతడు
జతై ఆనందపు జోరులో నను ముంచెత్తాడుగా
ప్రతి ఉదయం అరుదెంచే అరుణవర్ణపు రవిఅతడు
నా నుదుట సింధూరమై మెరుస్తున్నాడుగా
జీవిత నౌకను ఒడ్డును చేర్చే సరంగుఅతడు
నౌకనుఊపే అల్లరినదిని నేనయ్యానుగా