సరియే
సరియే
కోర్కెల జరదా..నములుట సరియే..!?
ఆడిన ఆటయె..ఆడుట సరియే..!?
జవాబు ఇచ్చును..కాలం మెల్లగ..
సహనం పట్టక..పోవుట సరియే..!?
రసాలు తొమ్మిది..కావని తెలుసా..
సరసము దశమము..చేర్చుట సరియే..!
కోమల మైనది..శిరీష కుసుమం..
వినగా కోమలి..అలుగుట సరియే..!
ఉన్నది స్వర్గం..లేనిది నరకం..
ఎఱుకను చక్కగ..నిలుపుట సరియే..!
సృజనకు అద్దం..అంతరంగ దధి..
ధీటుగ లోపల..మునుగుట సరియే..!
