STORYMIRROR

ARJUNAIAH NARRA

Fantasy

4  

ARJUNAIAH NARRA

Fantasy

సప్తస్వరాల సరిగమ

సప్తస్వరాల సరిగమ

1 min
278

సప్తస్వరాల సరిగమ ఈ ఏడూ వసంతాలు

దేనికదే మీ హృదయం అలపించె కమ్మని రాగం

నా హృదయం పొందెను జీవన రాగం

మీరు విసిరిన చిరునవ్వులే

నాకు చిరు దీవెనలు

నాతో పంచుకున్న మీ అనుభవాలు

నా మానసిక ఎదుగుదలకు బలాలు


కుమిలిపోయినపుడు మీ వాక్కులే

నేర్పేను నాకు జీవన వేదం

దుఃఖం దూరమయ్యే మీ అనురాగంతో

సంవత్సరాలు గడిచే ఉత్సహంతో

మీ చెంత మరిచిపోతిని నా చింత


ఏది సాటిరాదు మీ ప్రేమకు

ఎన్నటికీ మరిచిపోను మీ మమతను

మీ కొండంత ప్రేమను నా గుండెనిండా

నింపుకొని ఈ గమ్యం లేని బాటసారి

చివరిగా నా అసలు గమ్యం దిశగా 

బయలు దేరే సమయం ఆసన్నమైంది

అడ్డంకులు, ఆటుపోట్లను తట్టుకునే

ధైర్యం ఇచ్చిన మీ అందరి ప్రేమ

హృదయాలకు నా కుటుంబం తరుపున

శతకోటి వందనాలు సమర్పిస్తూ......

(ఆంధ్రప్రదేశ్ లోని నందిగామ పాలిటెక్నిక్ కళాశాలలో ఏడూ సంవత్సరాలు నన్ను ఆత్మీయునిగా చూసూకున్న ప్రిన్సిపాల్స్, HODs, Faculty, Office employees మరియు మిత్రులు అందరికి నా వందనాలు)



Rate this content
Log in

Similar telugu poem from Fantasy