సంకల్ప జ్యోతి
సంకల్ప జ్యోతి
ఒక జ్యోతి కొన్ని వేల, లక్షల, కోట్ల జ్యోతుల ను వెలిగిస్తుంది
ఒక వ్యక్తి సంకల్పం, కోట్ల వ్యక్తుల సంకల్పమై బల పడుతుంది
ఇది చరిత్ర చెప్పే, సంకల్ప బలమని ఎన్నో సార్లు ఋజువైంది
స్వాతంత్ర్య సమర యోధుల సంకల్పం, ప్రజలను నడిపించింది
ఉద్యమం ఏదైనా, ఒక వ్యక్తి సంకల్ప బలం తో మొదలౌతుంది
ఆ సంకల్పమే, ఉద్యమ కారులను ముందుకు ఉరికిస్తుంది
ఈనాడు, కనిపించని కరోనా వైరస్ పై, పోరాటం సాగుతోంది
ప్రజానీకం, ప్రధాని మాటపై, సంకల్ప జ్యోతులను ప్రజ్వలించింది
ఈ జ్యోతుల వేడిలో, కరోనా వైరస్, మాడి మసి కాబోతోంది
మన దేశ సంకల్ప బలం, యావత్ ప్రపంచానికి వెల్లడౌతుంది.