స్నేహపు హారివిల్లులో...
స్నేహపు హారివిల్లులో...
నవ్వులవిరిజల్లులో
మనసు తేలిక చేసుకుందామనుకుంటే
రంపపుకోత సిద్దంగా ఉంటుంది
స్నేహపు హరివిల్లులో
మమతలు పంచుకుందామనుకుంటే
మాటల శరఘాతం మరణాన్నే తలపిస్తుంది
కన్నీటిజలనిధిలో
జలకమాడడం కొత్తేమీ కాదే
కానీ రుధిరధార జాలువారుతుంటే
ఆనకట్ట వేయడం సాధ్యమవ్వకుంటే
ఎంతకాలమీపయనమని ప్రశ్నిస్తుంటే
జవాబుకోసం పదేపదే శూన్యంలోకే చూస్తుంటే
నిస్తేజం ఆవురించి నిర్వీర్యం చేస్తుంటే
స్త్రీజాతి చరితచూడ ప్రతిపేజీ ముళ్ళబాటే...

