STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

స్నేహం

స్నేహం

1 min
211

దీపమెట్టి వెతకగనే దొరికేనా స్నేహం..!?

దీపమూల మెరుగకనే వెలిగేనా స్నేహం..!?


చెలియ లేదు ఏనాడూ గడప బయట తెలుసా..!?

మాయమబ్బు తొలగకనే చిక్కేనా స్నేహం..!?


తోటలోని ఆ కోకిల ఆవేదన ఏమో..?!

మావి చిగురు తొడగకనే విరిసేనా స్నేహం..!?


మెఱుపుతలపు భావనలకు అద్దమంటె మనసే..

గుండెలయల మునుగకనే కురిసేనా స్నేహం..!?


వలపువీణ మీటుతున్న మౌనాలకు జయహో..!

నిన్ను నీవు తెలియకనే పెరిగేనా స్నేహం..!


Rate this content
Log in

Similar telugu poem from Romance