STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

సంధ్యా రాగం

సంధ్యా రాగం

1 min
361

తొలి కిరణమా కిరణ చరణమా

నిను తాకి పులకించే ఓ భువనమా

చిరు పవనమా తరు మిత్రమా

మేఘాలలో కలిగే ఆనందమా

ఉషోదయ సంబరమా

వర్ణోదయ అంబరమా

 ఆ దేవదేవుని చీనాంబరమా

శూన్యానికే ఆడంబరమా

ఏ చిత్రకారుని కళాత్మికమా

ఏ కుంచె గీసిన అద్భుత చిత్రమా

ఏ కవి రాయలేని కవిత్వమా

ఏ హృదయ లయల సంధ్యారాగమా



Rate this content
Log in

Similar telugu poem from Romance