సందేశం
సందేశం


ప౹౹
సందేశం ఒకటి పంపాను సారించి చూడుమా
సందేహంలేక సమ్మతించి మౌనము వీడుమా ౹2౹
చ౹౹
గుసగుసలుగా చెప్పా ఊసులా గుర్తుకోసమే
అసలసలుగా చూపానూ మదిలోని సరసమే ౹2౹
ఊహలోని ఆ వలపునూ వ్యక్తమే చేయాలని
స్నేహద్వారాల చెలిమిని స్వాగతించేయాలని
౹ప౹
చ౹౹
చరవాణి చేరవేసే వాహినిగా వర్థిల్లు నిత్యమే
పూబోణీ పులకించి సహకరించుటా సత్యమే ౹2౹
వరుస సందేశాలూ వలపుబాటలో సహజమే
సరస సమావేశాలతో సన్నిహితమూ నిజమే
౹ప౹
చ౹౹
వెసులుబాటే చూసుకొని వేగమేస్పందించవా
అసలు పాటే ప్రేమలోన కలదని నినదించవా ౹2౹
అందిన వాయుసందేశం వలదనకనూ చూడు
పొందిన అనుభూతినంతా తెలుపుమా నేడు ౹ప౹