STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

సందడి సంబరం

సందడి సంబరం

1 min
1

సందడి, సంబరం.

(వచన కవిత)

**************************"************

శ్రీమహావిష్ణువే శ్రీదేవితో కూడి దిగి వచ్చినాడు.
ఈ మహీతలము నేల నయోధ్యలో జన్మించినాడు.

ప్రియసోదరులతో పలు శాస్త్ర విద్యలు నేర్చినాడు.
భయము బాపుచు సతము జనుల నాదరించువాడు.

మొక్కవోని దీక్షతో ముని వెంట నమ్రతతో నడచినాడు.
రక్కసుల దునుమాడి జన్నము గాచిన సుర పూజితుడు.

సతి యహల్య శాపమును తొలగించిన దుఃఖ హరుడు.
అతులిత శౌర్యధనుడనయము గురువుల సేవించు వాడు.

అదిగదిగో నా మిథిలాపురముకు విచ్చేసినవాడు.
సుదతి జానకికి సరి జోడుగా నిలిచెడి దివ్యాత్ముడు.

మరుని మించిన లావణ్య వంతుడీ మనోహరుడు.
హరుని విల్లును విరిచిన నాదిత్య వంశోద్భవుడు.

దిగ్గున జనులెల్ల తేరిపార చూచుచు పొంగినారు.
సిగ్గుల మొగ్గ సీతమ్మ చిరునవ్వులు చిలికించింది.

దివిజ వరులెల్ల దీవెనల వర్షము కురిపించినారు.
నవ వసంత వేళలో నచ్చరలు నాట్య మాడినారు.

 పందిళ్ళు వేసి, తోరణాలు కట్టి బాజాలు మ్రోగించారు.
సందళ్ళు చేసి సంబరాలతో లోకులు సంతసించినారు.

ముందు ముందెన్నో ఘన కార్యములు చేయువాడు.
అందాల రామచంద్రు డవనీసుతను జేపట్టిన ఘనుడు.
**************************************


Rate this content
Log in

Similar telugu poem from Classics