సమయానికి
సమయానికి
ఉన్నచోట మనసుంటే..లోటుండదు సౌఖ్యానికి..!
అంతరంగ బోధనలో..అడ్డుండదు జ్ఞానానికి..!
అనుమానం తోడైతే..తడబడాటే అడుగడుగున..
వివేకమే శ్వాసైతే..చోటుండదు శోకానికి..!
నిచ్చెనలను లాగేసే..చేతులేమి చేయగలవు..
మౌనం నీ ఇల్లయితే..చేటుండదు శాంతానికి..!
బద్ధకాన్ని చెలిమిమీర..జోకొట్టే వారెవరో..
చైతన్యం నేస్తమైన..తిరుగుండదు విజయానికి..!
అధికారం చలాయించు..తత్వమదే తొలిశత్రువు..
సత్యమింత పట్టుబడిన..పట్టుండదు సమరానికి..!
తెలియజెప్పు బుద్ధుడెవరొ..దిగిరాడోయ్ ఏవేళా..
నేర్చుకునే చొరవుంటే..అలుపుండదు చిత్తానికి..!
