సఖీ ఎదలో
సఖీ ఎదలో
తెలతెల వారే..ముచ్చట మధురం..!
బంగరు దివ్వెగ..బ్రతుకుట మధురం..!
మాటల కందని..చేతలు ఎవరివొ..
కార్యదీక్షలో..మునుగుట మధురం..!
తీరని ఆశల..కలవర మెంతో..
కలలకు రెక్కలు..మొలుచుట మధురం..!
రాలని ఆకులు..రసవంతములే..
తియ్యని ఊహలు..వెలుగుట మధురం..!
కవితలు అల్లగ..పదములు ఎన్నో..
చెలి రూపమునే..చెక్కుట మధురం..!
గంధా లెన్నో..ఊరించును లే..
దేనికి లొంగక..మిగులుట మధురం..!

