సితారల
సితారల
నీ చూపు సహస్ర సితారల వైభవం
నీ రాక స్వప్న శోభిత ఆగమనం
చెలియ అందాలలో ఒక సొగసు
చెలియ పలుకు చిలుకల ఉలుకు
తానొక విరులు మొలక కాంతి కిరణాల
కానుక నేత్ర ధనస్సుల అందాల వేడుక
చెలి నీ మనసు చూసే చూపులో ఉన్నది.
నా స్థానం నీ గుండె లోనని
నీ మనసుతో ఓరకంట చూస్తావు
నీ ప్రేమతో అనుక్షణం ఆహ్వానిస్తావు
ప్రతి ఉదయం వేచెను నా నయనం నీ చూపుల కోసం.
ప్రతి రాత్రి చూస్తుంది నా హృదయం
ఎప్పుడు తెల్లవారి నీ నయన కిరణాలు
నా హృదయాన్ని తాకుతాయని...

