STORYMIRROR

Dinakar Reddy

Abstract Classics

4  

Dinakar Reddy

Abstract Classics

సిలకా

సిలకా

1 min
242

అన్నీ తెలుసంటావు సిలకా

నా వాళ్ళు నాదంటూ దేవులాడేవు సిలకా

నా ఇల్లు నా ఆస్తి అని పరితపించేవు సిలకా

నాది నాది అని మురిసిపోయేవు సిలకా


యవ్వనపు పొంగులూ సిలకా 

కాలంలో కరిగేను సిలకా

బంధాల పద్దులూ సిలకా 

పైవోడు రాస్తడే సిలకా

ఆ కాలమొస్తేను సిలకా 

యముడు అగుపడతాడు సిలకా

ఇష్టమో కష్టమో సిలకా

ఎల్లక తప్పదే సిలకా


అందుకే మోహమ్ము వదలవే సిలకా

బూడిద (భస్మం) పెట్టేటప్పుడు సిలకా

ఈ ఒళ్లు నీ వోళ్ళు బెమ అని తెలుసుకో సిలకా

మరణంలో నీ తోడు సిలకా

మహాదేవుడొక్కడే సిలకా

ఇషయం ఇప్పి సెపుతా ఉండా సిలకా

ఆపైన నీ ఇష్టమే సిలకా

వేదాంతమో అనుభవమో

కూసింత వినవే సిలకా



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract