శుభోదయం
శుభోదయం
కనక మణిమయ భూషితాంగా
పుడమి చివరన నీ పరంగా
ఉరికినావా తూరుపు వేడగా
అవని ఉపరితలమే వేడిగా
అరుణబింబమే కాంచగా
కనుదోయి తరమా మెచ్చగా
తనువు సలసల మరగగా
వెచ్చదనము పంచే వేలుపుగా
చుట్టుముట్టిన మబ్బులే తాకగా
దోబూచులాటల తీరుగా
పైపైకి రావా ఆపలేని సంకల్పమిదియని చాటుగా
వెలుగు రేఖల జిలుగుకుంకుమ వసుధ నుదుటన దిద్దగా
ధగధగ మెరిసే బింబమై నింగిలో విలసిల్లగా.
భానుతేజమే కోరే హరిత హృదయాలు వెలుగొందగ
రావేల స్వామీ ఉదయకాంతను ప్రియమార ముద్దాడగా............

