శశి కాంతులు చంద్రిక
శశి కాంతులు చంద్రిక
ఆ శశి కాంతుల చంద్రిక...
ఇలను చేరిందేమో...
నేడు నా ఎదుటకు వచ్చిందేమో...
యన్న సందేహపు సంకెళ్ళను విప్పి...
సాగర తీరపు సంధ్య వేళలు తెచ్చి..
పుత్తడి వెలుగుల పున్నమి నింపిన...
వెచ్చని వెన్నెల కాంతులవి...
ఆమె మెలక సిగ్గుల మోమున విరిసిన...
లేత అధరాల మధుర దరహాసాలు...
మెరిసే ఆ సిరి...
విరిసే ఆ పూ విరి...
కురిసే ఆ తేనెల ఝరి...
ఉన్నాయి ఆ నవ్వులోన...
సరిరావు మరి... ఏ మల్లెల మందహాసాలు...
అవి...
అగుపించని మనసుని అల్లి...
వయసొచ్చిన తనువుని గిల్లి...
తనవైపే చూడమంటున్నాయి....
అది మర్యాద కాదని...
మనసుని అటునుండి మరల్చిన...
వినని చూపులు...
వినయం వీడి...
మరల అటు మరలి...
తన పెదవంచులు తాకి పలకరిస్తున్నాయి...
పలకరించి పరవశాన పులకరిస్తున్నాయి...

