శోకగీతమై...
శోకగీతమై...
ఊరించినవర్ణాలన్ని
ఒక్కటిగాకలిసి నలుపైపోతుంటే
కనులకు కనరాని వెలుగేదో
నను చీకటిలో తోసేస్తుంటే
శిలనైన నన్ను కరిగిస్తూ
కన్నీటిఅలని చేసేస్తుంటే
నేకోరుకోని నానవ్వులో రాగాలన్నీ
శోకగీతమై వినిపిస్తుంటే..
నేకోరే ప్రతిఆశా ననువీడి
ఆకాశంలో అందరాని చుక్కయిపోతుంటే
నిన్నే చేరాలా నన్నే వీడాలా

