సహోదరా
సహోదరా
వివేకమే నశించెనా..విరోధమే సహోదరా..!
విషాన్నమే రుచించెనా..విలాపమే సహోదరా..!
క్షుధార్తియే సుడెత్తెనా..కథాంతమే సుఖాంతమే..
బలాలతో నవోదయం..సుదూరమే సహోదరా..!
సమానతే నినాదమై..సునాదమై అయోమయం..
మనీషిగా ప్రజాహితం..ప్రధానమే సహోదరా..!
ప్రకోపమే అభధ్రతా..ప్రచోదితం గ్రహించవా..
వృథాకదా ప్రతాపమే..అశౌచమే సహోదరా..!
అనాహతం సమాశ్రితం..సముద్భవం అలౌకికం..
చలోక్తిగా తలంచకోయ్..ప్రబోధమే సహోదరా..!
తపించవా జపించవా..ధరించవా తరించగా..
స్మరించవా సదాహితం..సుమంత్రమే సహోదరా..!

