STORYMIRROR

Jyothi Muvvala

Drama Action Others

4  

Jyothi Muvvala

Drama Action Others

శీర్షిక: నీలిమేఘాలు

శీర్షిక: నీలిమేఘాలు

1 min
224


ఎన్నో చిరునవ్వులు 

పెనవేసుకున్న ప్రేమానుబంధాలు 

అందంగా అమర్చుకున్న అనురాగాలు!

మరెన్నో బాధల భారాలు

పంచుకున్న భుజస్కంధాలు 

 అడుగులో అడుగై నడిచిన పాదాలు... 

అంతలోనే అర్థం కాని అపార్థాలు

అల్లుకున్న అపోహలు 

కనుమరుగై పోయినా ప్రేమాభిమానాలు!

 అందమైన జీవితాలకు తగిలిన దిష్టి దోషమో

ఆలోచన లోపమో... 

మనసుకు అనుమానపు దుమ్ము పట్టి

తుడిచిన వదలని మరకై 

కనిపించని సత్యాలు!

అంతరంగ పోరలలో మిగిలిన అవశేషాలు!

సరి చేసుకోలేని అగాధాలు 

జీవితచిత్రాన్ని ఛిద్రం చేసిన ఆనవాలు

వడ్రంగి పిట్టలా తొలుస్తున్న జ్ఞాపకాలు 

మనసుని మెలిపెట్టే అనుబంధాలు! 

నీలి మేఘాలై కమ్ముకున్న అహంభావాలకు

చితికిపోయిన మానవ సంబంధాలు

కాలపురుషుడి ఆటలో ఆట బొమ్మలు!!


-జ్యోతి మువ్వల


 





 







Rate this content
Log in

Similar telugu poem from Drama