STORYMIRROR

Jyothi Muvvala

Abstract Classics Inspirational

4  

Jyothi Muvvala

Abstract Classics Inspirational

శీర్షిక :నీకే తెలియని నువ్వు

శీర్షిక :నీకే తెలియని నువ్వు

1 min
819


శక్తి నింపుకున్న జీవంతో

అందరిది అందమైన దేహమే!

 ఆకాశం , భూమి లా

లింగాలలో అంతరాలు

తెలుపు నలుపుల వర్ణాలు 

దేహానికే కానీ ప్రాణానికి లేని రూపాలు!


కారు మబ్బులో మాయమైన నీలిమేఘంలా

మంచి నీటిని దాచిపెట్టిన పాలలా 

కలితో కలుషితమైన మనస్తత్వాలు

 మనుషుల్లోని ఈ తారతమ్యాలు

నీకే తెలియని నిన్ను పరిచయం చేస్తాయి!


నిషీధిలో నిక్షిప్తమైపోయినా నిజాలు 

నిర్వికారంగా మిగిలిన సాక్షాలు 

నిస్సహాయత నీడై సాగితే

కక్షలు.. కార్పణ్యాలు మృగాన్ని చేస్తుంటే

మంచి మానవత్వం మనిషిని చేస్తుంది

స్వార్థం బానిస చేస్తుంటే

త్యాగం యోగిని చేస్తుంది


నాలుగు దారులు నాలుగు దిక్కులై 

మార్గాన్ని చూపగా

యద్భావం తద్భవతిగా

ఎన్నుకున్న దారిలో బుద్ధిని బయటపెడుతూ 

సద్గుణం సద్గతిని కల్పిస్తుంది

మనిషి వేషం వేసుకున్న ఆత్మకు మాత్రం

 విముక్తి దొరకని శిక్ష విధిగా వేధిస్తుంది!!


--జ్యోతి మువ్వల










రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract