STORYMIRROR

Jyothi Muvvala

Fantasy Inspirational Others

4  

Jyothi Muvvala

Fantasy Inspirational Others

శీర్షిక: ఇన్స్పిరేషన్

శీర్షిక: ఇన్స్పిరేషన్

1 min
238


 పోగేసుకున్న స్మృతులను 

అఘాతంలోకి నెట్టిన ఆవేదనలను

అటుగా వెళ్ళినప్పుడు

కొన్ని అక్షరాలుగా మలిచి పారేసుకో!


మనసు నలిగిన మౌనానికో

వయసు ఒదిగిన ఒంటరితనానికో

అలసిన దేహానికో

కాస్త ఓదార్పునిస్తాయి!


నీలో నువ్వు సతమతమైతే

నీ కథలో విజయాలే తప్ప

 అపజయాలు లేవని

అసూయపడి అపోహలో బతికేస్తుంటారు

నీ పతనానికై ఒళ్లంతా కళ్ళు చేసి చూస్తుంటారు!


కష్టాలే ఎప్పుడూ నిజమైన నేస్తాలు

అన్ని బాగున్నప్పుడు

వచ్చిపోయే చుట్టాలే సుఖాలు 

నాణానికి బొమ్మ బొరుసులా

పుడమికి వెలుగు చీకటిలా 

అన్ని షెడ్లు చవిచూస్తేనే జీవితం !


రుచి చూడని పదార్థానికి రివ్యూ అడిగితే

ఏముంటుంది సమాధానం

గాయాలు పడ్డ దేహాలకే

తట్టుకునే ఓర్పు తప్పించుకునే నేర్పు ఉంటుంది!


ఆ అనుభవాల సంపద 

పూలవనమై వికసిస్తుంది 

అర్ధాంతరంగా ముగిసిన కథలకు 

ముగింపు లేని క్లైమాక్స్లకు 

 సరికొత్త ఆశై చిగురిస్తుంది 

మరో కొత్త జీవితానికి నాంది పలుకుతుంది !!


జ్యోతి మువ్వల


Rate this content
Log in

Similar telugu poem from Fantasy