STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

సహచరి తో పయనం

సహచరి తో పయనం

1 min
0


ఇద్దరం జతకట్టాం, నాలుగు కాళ్లతో నడుస్తున్నాం

నాలుగున్నర దశాబ్దాలు ఆడుతూ పాడుతూ పోయాయి

గతం బాధపెట్టలే పెద్దగా

కోరికలు కూడికలే, గుణకారాలు భాగాహారాలు కాదు

కొన్ని తీసివేతలైనా పట్టించుకోలేదు

భవిష్యత్తు పెద్దది కాదు, చిన్న పిల్ల

ఎలా మోస్తామన్న బెంగ లేదు

నిన్నటి దాకా ఎలా గడిచిందో రేపంతే అన్న నమ్మకం

కలిసి సంగీత సాధన చేయలే మాట సాధన చేశాం


ఉమ్మడి కుటుంబం పెంకుటిల్లు

బంతి భోజనాలే కాదు పంక్తి పరుపులు పరుచుకునేవి

పెరట్ల చేదబావితో కుస్తీలు, వాకిట్లో అరుగుపై ముచ్చట్లు

వసతులు తక్కువైనా బాధనిపించలే

చెమట చిందించిన కోపాలు అర్థం చేసుకున్నాం

కష్టాలకు తోడునీడయ్యాం

ఏకాంతానికి రాత్రుల్లే మిగిలేవి గుసగుసలుగా


ఉమ్మడి నుంచి ఒంటరితనానికి చేరాక

పిల్లలు ఉద్యోగాల రెక్కలతో ఎగిరిపోయాక

సహచరమైంది జీవితం

ఒకరికొకరం నీడలం, పాలు తోడేసినట్లు తోడుగా

వ్యాయామం చేసినా, వాకింగ్ చేసినా

రోగాల దోమలు కుట్టినా

తిన్నా, విందులు వినోదాలకు తిరిగినా

జీవితం సహచరమయం

నేడు రేపు జీవితాంతం


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance