STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

సౌఖ్యం

సౌఖ్యం

1 min
2

రెప్పల టపటప..ఆగిన సౌఖ్యం..! 

గుండెకు ఊరట..ఇచ్చిన సౌఖ్యం..! 


ఆలోచనతో..ముప్పేం లేదోయ్.. 

శ్వాసల గగనం..అందిన సౌఖ్యం..! 


పాఠం వినడం..నిజముగ కష్టం.. 

బుద్ధికి చిత్తం..చిక్కిన సౌఖ్యం..! 


మోహపు గొడుగున..బ్రతుకే గొడవే.. 

విరహపు గులాబి..విరిసిన సౌఖ్యం..! 


ఉన్నది ఏదో..పోవున దేదో.. 

మనసొక నదిగా..మిగిలిన సౌఖ్యం..! 


మౌనం మాయం..చేయును గారడి.. 

సత్యం చక్కగ..పట్టిన సౌఖ్యం..! 



Rate this content
Log in

Similar telugu poem from Romance