same to same
same to same
అంతా same to same
చూసే కనులకు
చూడని మనసుకు
కానీ ఏదో మర్మం కప్పుకుంటుంది
చుక్కల్లోని వెన్నెల మంచు పువ్వులు కప్పుకున్నట్టు!
అంతా same to same
అక్కడ ఇక్కడ పువ్వులే కురుస్తాయి
ఆడ కొమ్మలకు పూలు పూస్తాయి
ఈడ ముళ్ళు మొలుస్తాయి
ఆచోట పన్నీరు పారితే
ఇచ్చుట కన్నీరు ప్రవహిస్తుంది
కానీ లోకం దృష్టిలో అంతా same to same
ప్రాణాలు ఉండే దేహలకు మనుషులు అని పేరు
కానీ బొందులో ప్రాణాలకే విలువ అనుకునేరు
ధనవంతులు
బీదవాళ్లు
అనే తేడా ఉంటుంది!
ఆ ప్రాణాలకు ఒక విలువ ఉంటుంది
అది పోతే పార్థివ దేహమని
లాంఛనాలతో సత్కారాలుంటాయి
మరి వీళ్ళు అనాధ శవాలు
ఆరుబయట అగ్గిలో చలికాచుకుంటాయి !
నింగి నేల చెట్టు చేమ అన్ని సమానం
అంతా సమానం
ప్రాణం పోసిన దేవుడికే
పాలించే రాజుకు కాదు !
ప్రతి దాని విలువ కొనుక్కునే వాడి స్థితిలో పెట్టి
కొందరికే చెల్లుబడుతున్నాయి
అది నీ తప్పో నా తప్పో కాదు
అది అంతే....
యాపిల్ పండు మీద ఉన్న వ్యాక్స్ లా
చూడటానికి ఒకేలా ఉంటాయి
అయినా అందరికీ అన్ని చెందవు
అవి అక్షరాలైనా, పదవులైన
చివర ఆఖరికి అమ్మ ప్రేమ అయినా
కొనుక్కునే వాడి జేబుకి చిల్లు పడితే తప్ప
నిన్ను చేరాలంటే ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది
దానికో విలువ ఉంటుంది
ఆ లెక్కను సరిచేసి చూస్తే
సేమ్ టు సేమ్
కొండమీద కోతి కూడా కోరి వస్తుంది!!
జ్యోతి మువ్వల
