సాంకేతికం
సాంకేతికం
ప౹౹
మీట నొక్కిన చాలు మిగులు సౌఖర్యాలు
మాట చెప్పిన చాలునే మరెన్నో సపర్యలు ౹2౹
చ౹౹
సాంకేతికత విప్లవంనకు సాటిలేదులే మరి
అంకితమై అన్ని పనులూ చేయునుగ సరి ౹2౹
కొత్త టెక్నాలజీ రోజుకో మార్పు జీవితంలో
నత్త నడకలే చెల్లవు మరి భావి జీవితంలో ౹ప౹
చ౹౹
సెల్ఫోనులొచ్చాకా పెరిగే దాని గణగణలు
సెలయేటికి సహజమైనవి ఏవా గలగలలు ౹2౹
అనుక్షణం సెలసాలలో బందీగానే జీవితం
తక్షణం విముక్తి కాకుంటే లేదూ ఇక హితం ౹ప౹
చ౹౹
గులాబి వెనుక గూడముగా మల్లున్నటులే
చలాకి చాలనం వెనుకా దోషం ఉండునులే ౹2౹
మనిషి మనుగడకు ఆసాంకేతకమవసరమే
మనిషి బానిస కానంతవరకు అది సరసమే ౹ప౹