STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama Inspirational

4  

Dinakar Reddy

Abstract Drama Inspirational

సామ్రాజ్యం

సామ్రాజ్యం

1 min
233

ఎప్పటికప్పుడు ప్రమాదాలు

ముంచుకొచ్చిన శత్రువుల ముప్పులు

తల్లడిల్లేట్లు చేసే ప్రకృతి వైపరీత్యాలు


సామ్రాజ్యం అంటే 

కేవలం భోగాలేనా

ఆకస్మిక దాడులు

కక్ష్య సాధింపులు

కుటుంబ రాజకీయ శత్రువులు


రాజ్యకాంక్ష బలపడి

రవంత విశ్రాంతి లేకుండా

యుద్ధభూమిలో కాలం గడపడం 

ఇవి కూడా ఉంటాయి కదా


మరి అన్ని ప్రమాదాలు ఉన్నా

అదే పదవంటే వ్యామోహం ఎందుకు

రక్తి కోసమా

అధికార దర్ప ప్రదర్శనకా

విరక్తి కలిగేంత అనుభవించేందుకా


ప్రజలను పాలించే వాడు 

మంచి కోరే రాజులు

చూపిన మార్గం ఏమిటి

కేవలం అధికార దాహమైతే కాదు కదా

ఇంకేదో ఉంది

సుభిక్ష రాజ్య స్థాపనకు

త్యాగాలు మూలమయ్యాయి కదా


మరి కుత్సిత రాజకీయాలకు

దేశములు నిలబడునా

వాటి నుంచి జాతి రక్షించబడునా


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract