STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

రూపం లేని రసరమ్య చిత్రం

రూపం లేని రసరమ్య చిత్రం

1 min
283

గుండె దాటిన ఆరాటం, నీ అధరాలకు గులామంటోం ఉరకలేస్తున్న యవ్వనాశ్వం... తొలి చుంబనపు మధురిమకై పరుగెడుతోది.


ప్రకృతిలోని అణువణువు... మన పేర్లను నీలాకాశంలో లిఖిస్తున్నాయి. ఏ క్రీగంటి చూపు. హద్దులను దాటి... ముద్దులతో పొద్దుపుచ్చమంటోంది..


కోరికలతో నిండిన... బాహువుల్లో చేరి చేరి సగమై, ఇరు పెదవులకూ తాళం వేద్దాం


అధరామృతాల వేడి, రుధిరాన్ని రగిలిస్తున్నా... హృదయం కరిగిపోతోంది, ప్రేమ పరిష్వంగంలో


దాహార్తితో.... కాగుతున్న అధరాలు, మనస్సును మంచులా కరిగిస్తున్నాయి.


ఇరు దేహాల ఇంద్రజాలానికి, ఏ పేరును పెట్టను?! అదరామృతాల నుంచి జాలువారే. రసరమ్య చిత్రానికి ఏ రూపమివ్వను?! చెప్పవా ప్రియతమా!!!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance