STORYMIRROR

# Suryakiran #

Romance

4  

# Suryakiran #

Romance

రోజాపూలను పూరించి !

రోజాపూలను పూరించి !

1 min
433

ఓ చెలీ ! నీవెక్కడున్నావో తెలియక

ఈరోజు నా గుండె లయలో హెచ్చుతగ్గులు .

అడుగుల సవ్వడులూ వినబడక

చిన్నబుచ్చుకున్నవోయీ ఎన్నడూ లేనంతగా

ముంగిట్లోని తళుకులీను గులాబీ బాలలు !


కాసేపు ఇక కంటికి కనిపించవేమోనని ,

మరికాసేపు నీపై నా ఆశలను మరచిపోవని .


నాకేనా ఈ ప్రేమను ప్రకటింపజేసే ప్రహేళిక ?

లేక , ఇది ప్రేమికులందరు

ఏదో ఒక సమయాన ఎదుర్కొనే విరహవీచికా ?


దోబుచులాటలో ఒకరిపై ఒకరికి మరింతగా

ఉద్వేగము పెరిగి , అలకలు తరిగి .

అందుకోవాలనే ఆత్రము మురిపించి ,

అందుకే రేయింబవళ్ళు తపించి

ఇరువురు వెచ్చనికౌగిలిలో ఒదిగి

మనసారా పరవశించి ముచ్చట తీర్చుకోవచ్చనే !


మబ్బుతెరలు తొలగుతూ

కాసే వెన్నెలలో ఎంతో తెల్లదనం ,

వేసవివేడిని తగ్గిస్తూ కురిసే

వానజల్లులోనూ కావలసినంత చల్లదనం .

రోజుకొక కొమ్మకు పూస్తూ పూలు ,

ఉషోదయ కిరణాలు జాలువారగా

అక్కడక్కడా మెరుస్తూ

ముత్యాలను తలపించే మంచుబిందువులు .


రావా ఎదుటకు ! నీ అల్లరి చాలించి ,

రోజాపూలను పెదవులపై పూయించీ !

మాటలమాధుర్యాన్ని నాకందించి ,

మనలో ఆనందానుభూతులను పంచీ !!




Rate this content
Log in

Similar telugu poem from Romance