రంగులపిట్ట
రంగులపిట్ట
ఊహలకు ఎన్ని రెక్కలో
భావానికి ఎన్ని అర్ధాలో
ఉరికే మనసుకు ఎంత ఎంత వేగమో
అగనివే కదూ కాలపు క్షణాలు
ఏది ఎవరికోసం ఆగనే ఆగదు సుమా
మనసొక మాయాజాలం
నినురంగులహంగుల ఇంద్రజాలo లో
ముంచి తెల్పే రంగుల పిట్ట
తీరని మొహాలతీరాలకు
ఆశల ఎండమావులవెంట
పరుగెత్తించేమంత్రగత్తె
అంతేనా నీడను నిజంగా
నిజాన్ని నీడగా భ్రమింప చేసి
అలుపెరుగని ఆశాలతీరాలవెంట
అలవోకగా అర్రులు చాపించేది
నిస్సందేహంగా నిబ్బరించుకోలేని
నిశ్శబ్దపు విస్ఫోటనo మనస్సే
నినునిలువెల్లా నిప్పులేకుండా దహించేది
ఆనంద డోలల్లో రంగుల పిట్టలా నిను తేల్చేది అదే
గాఢాంధకారాల అధః పాతాళo లోకి తోసేది తానే
అందుకే మనసును నియంత్రించేందుకు ఎంతో సాధన
మరెంతో క్రమశిక్షణ, మనిషికి అవసరం
లేకపోతే కళ్యాలు లేని గుర్రమే
దూరపు చూపుకు రంగుల పిట్ట
నిశిత దృష్టికి అలవికాని అనంతం

