రంగీ ఓ రంగీ
రంగీ ఓ రంగీ
వయసుపొంగు రెక్కలతో ఎగిరిపోదామా,
మనసుకు వయసెందుకని చెప్పుకుందామా,
అలరించు ప్రేమలతో చింతలన్నీ తీర్చుకుందామా,
అందమైన ప్రేమనే తేనెవాగు అనుకుందామా,
గుండెగుబులుకు అనుబంధపు మంత్రమే పెట్టుకుందామా,
హృదయపు తలపులను నవ్వులతోటలో పంచుకుందామా,
స్వర్గమైనా నరకమైనా చూపుల కౌగిట్లతో చేరుకుందామా,
ముసుగులేని చెలిమినే జీవితంగా చెప్పుకుందామా,
మమతలమేడలో మనసువేదన మరచిపోదామా,
నాకునీవు నీకునేనుగా బ్రతుకంతా ఉండిపోదామ

