రమ్మంది...
రమ్మంది...
రమ్మంది సోయుగం ఒకసారి వచ్చిపోవా
ఝమ్మంది నాదం మనసునే గుచ్చిపోవా
వలపు వాకిళ్ళే తెరచాయి ఓ వద్దికతోనే
అలపులేని ప్రేమ ఆచరించు పద్దతితోనే
రమ్మంది సోయుగం ఒకసారి వచ్చిపోవా
ఝమ్మంది నాదం మనసునే గుచ్చిపోవా
జాలిలేని ప్రేయసి జలకమాడే ఓ ఊర్వసి
గాలిమారే గాంధర్వం ఒప్పేసుకో రూపసి
నిండు చందమామా నిదురలేచే కోరికతో
పండు అందమా పరిహసించకు చేరికతో
గాయాలు మాన్పనే గానమే సాధనమూ
గేయాలు రాసేసుకో పంచనే ఆ ధనమూ
రమ్మంది సోయుగం ఒకసారి వచ్చిపోవా
ఝమ్మంది నాదం మనసునే గుచ్చిపోవా
చిలుకమ్మా
పలుకమ్మా పలవరింతే చూపి
కులుకమ్మా కుందనమై బాసించే తట్టి లేపి
తలపుల్లో తన్మయమే తనువంతా చేరాక
పిలుపుల్లో గౌరవమే చూపాలి ఏమి కోరక
రమ్మంది సోయుగం ఒకసారి వచ్చిపోవా
ఝమ్మంది నాదం మనసునే గుచ్చిపోవా
వలపు వాకిళ్ళే తెరచాయి ఓ వద్దికతోనే
అలపులేని ప్రేమ ఆచరించు పద్దతితోనే
కడలు కెరటం కనిపించదు చేరాక తీరమే
ఒడలు పోరాటం వలపించునే నీరుక్షీరమై
కడలు కెరటం కనిపించదు చేరాక తీరమే
ఒడలు పోరాటం వలపించునే నీరుక్షీరమై
రమ్మంది సోయుగం ఒకసారి వచ్చిపోవా
ఝమ్మంది నాదం మనసునే గుచ్చిపోవా