రగిలే హృదయం.
రగిలే హృదయం.
లావాలా ఎగసిపడే అగ్నికణం నా గుండె శబ్దం..
ప్రతి రక్తపు బొట్టులో ఎర్రని వర్ణపు వేడి సెగ...
మండే అగ్నిగోళమై దేహంతో రగిలే నిప్పు కనికలు..
ఎరుపు వర్ణంతో వేడెక్కిన హృదయపు గోడలు...
లోపలి దేహపు కుంభస్థలాన్ని బద్దలు కొట్టే వేడి నిట్టూర్పులు...
కోపాన్ని ఓ మాదిరిగా మోసే బరువులాట..
రౌద్ర కళ్ళల్లో దాచిన అశ్రువు నిప్పు తునకలై మారెక్షణం..
భగభగ మండే భానుడి మల్లె
రగిలే వేడికి తార్కాణం..
మండే గుండెకు దాహార్తి కరువు..
అది మిగిల్చే మనోవేదన...
కరుడుగట్టిన లోకంలో ఒంటరిగా మిగిలిన
మండే గుండెను ఓదార్చే చేతులకై నిరీక్షణ...

