STORYMIRROR

Ramesh Babu Kommineni

Romance

4  

Ramesh Babu Kommineni

Romance

రెక్కలొచ్చిన ఊహలు

రెక్కలొచ్చిన ఊహలు

1 min
191

ప॥

నిద్రలేని రాత్రులూ నిశీధి ప్రేమయాత్రలు

ఊహలకు రెక్కలిచ్చి ఊరించే మాత్రలు ।2।


చ||


అల్లి బిల్లి చుక్కల చదరంగం ఆకాశాన

చల్లచల్లని చందమామ సాగే పరవశాన ।2।


కదిలే ఊహలు కాలమే మరచి కరగేను

మొదలే ఆ తలపులు మదిలో పెరిగేను ।ప।


చ॥


గుండెనిండా ప్రేమ ఊపిరే నిండనీ నీతో

పండుగల్లే మురిసెగా ఆ నచ్చిన పనితో ।2।


మనసే మల్లెల పందిరి వేసి మురిపించే

సొగసే సోయగం కొత్త చినుకే కురిపించే ।ప।


చ॥


అందని ద్రాక్ష అందకే ఐనదిగా పులుపు

పొందిన ప్రేమకు పొందికైన పేరు వలపు ।2।


నిశీధి రాయబారం నిక్కచ్చి ప్రేమ కోసం

నిర్యేదం నిభాయించూ కోరి సహవాసం ।ప।


Rate this content
Log in

Similar telugu poem from Romance