రైలుబండి
రైలుబండి
మన సొంతూళ్లకు రైలు బండి పోతున్నది
ఆఁహాఁ పోతున్నది ఓహో పోతున్నది
వలసకూలీలకు మాత్రమే చోటున్నది ఆఁహాఁ చోటున్నది "మన "
రమ్యమైన రాష్ట్రాలకు రైలుపెట్టెలు
వలస కూలీలు మాత్రం రావచ్చును
అధికారుల అనుమతులు తప్పనిసరిగా
వారిచ్చిన సలహాలను పాటించురు "మన "
అందమైన ఆశయాల రైలు ఇంజను
పెట్టెలన్నీ శుభ్రంగా తయారాయెను
స్టేషను సిబ్బంది పాత్ర మరువలేనిది
రైల్వే వారి సేవలను కొనియాడుదాం "మన "
సహకార సహనాల ఇనుపకమ్ములు
సహజీవన స్వాతంత్ర్యమే రైలు సిగ్నలు
రాష్ట్రాలముఖ్య మంత్రులు డ్రైవరులండీ
అభయమిచ్చు మోడీ గారు అప్పర్ గార్డు "మన "
సొంతూళ్లకు పోతున్నాం సంతోషంతో
రైలుకూత మాలో నింపే ఆనందమే
స్నేహాల స్టేషన్లో బండి ఆగితే
మేమందరం అధికారుల కండగా నిలుస్తాం.. "మన "