రాత్రి
రాత్రి
ఏళ్ళు గడచిపోతున్నా నిదురించిన రాత్రి లేదు
తీయనైన స్వప్నాలను నడిపించిన దారి లేదు
కనులకు చీకటి పూసే పున్నమలకు జాలి లేదు
జాములలో కనుపాపలనూరడించు లాలి లేదు
నెరవెన్నెల చిరుగాలిని కలిసి మంట పెడుతున్నది
విరహంతో కాలుతున్న ఈ తనువుకు హాయి లేదు
హేమంతం చలికూడా వణికిస్తూ నవ్వుతోంది
కప్పుకొనిన కంబళిలో చెలి కౌగిలి వేడి లేదు
దూరంగా వెళ్ళమనే కనుసైగలు చెబుతున్నవి
దరికి చేరమని పిలిచే మధురమైన వాణి లేదు
కలసిరాని కాలంతో కలిసిమెలిసి ఉంటున్నవి
ప్రతినిమిషం కాటేసే యాతనలకు హాని లేదు

