STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

రామ రామ

రామ రామ

1 min
2


(రుబాయిలు)

*******************

వెరపు బాపి భక్త తతికి శాంతి యొసగు దైవ మితడు
దరికి చేర్చి కాచుకొనుచు సౌఖ్య మొసగు దైవ మితడు
మదిని నిల్పి తల్చుకొన్న దీనాళికి తోడుగచని
పరమమిత్రుడగుచు వచ్చి శక్తి నొసగు దైవ మితడు.//

పుట్టినాడు కోసలమున వీరుడైన రాఘవుండు.
మెట్టినాడు మిథిలాపురి శూరుడైన రాఘవుండు.
పెండ్లి యాడి సీతమ్మను కాననముకు వెడలినాడు.
కొట్టినాడు రక్కసుడిని ధీరుడైన రాఘవుండు.//

రామ రామ యంచు పిలువ రక్ష నిడెడి దాశరథిని.
కామితంబులెల్ల తీర్చి కలిమి నిడెడి దాశరథిని.
ధర్మనియతి కల్గినట్టి నాయకుడౌ మావేల్పుని
నీమముగా కొల్చుకొందు జ్ఞాన మిడెడి దాశరథిని.//


Rate this content
Log in

Similar telugu poem from Classics