పుస్తక నేస్తం
పుస్తక నేస్తం
నిరాశతో దిగులు కమ్మిన మదిపై
ఉత్సాహాన్ని ఊపిరిపోసి
సరికొత్త సాహసాలు చేయిస్తాయి
పేజీలో ప్రతీ అక్షరం.
ఆలోచనలకు పదునెట్టి
ఫజిల్ గా మిగిలిపోయే జీవితానికి
పరిష్కారం చూపి
కొత్తదారుల వెంట పయనించమంటుంది.
కథలు చెబుతూ
పాత్రలతో ఎన్నో విషయాలతో
మనసు పై మసాజు చేస్తుంది.
మనసు నదిలో ప్రేమ అలలు
ఆస్వాదిస్తూ
వలుపు నావపై సేద తీర్చుతూ
కబుర్లు ఎన్నో చెబుతుంది.
కాలం సెలయేరు పై
కాగితపు పడవే పుస్తకం
గమ్యం ఏదైనా చేర్చి నేస్తమే పుస్తకం
