Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Ramesh Babu Kommineni

Drama Inspirational

4.8  

Ramesh Babu Kommineni

Drama Inspirational

పురుష లక్షణం

పురుష లక్షణం

1 min
389


ప౹౹

ఉద్యోగం ఉద్యోగం అరెరే ఆ ఉద్యోగం

పురుష లక్షణమేగా చేస్తున్న ఉద్యోగం ౹2౹


చ౹౹

చదువుకు సలాం తర్వాత మొదలవు

అదునులో రాకుంటేను తలకిందలవు ౹2౹

ఆ వేట ఆ పాటు కలిసొస్తేనూ సఫలం

ఓ తూటాలా గురిపెడితే కాదు విఫలం౹ప౹


చ౹౹

చేసిన ఉద్యోగానికి భాధ్యతలు మెండు

వేసిన అడుగే తప్పిన సమస్యల దండు ౹2౹

అనుక్షణం అప్రమత్తత ఎంతో అవసరం

అనుకృతినే శోధించాగ నిక్కచ్చి కోసరం ౹ప౹


చ౹౹

శాఖకే అధిపతిగ తీర్చా శాన అవసరాలే

ఒకే లక్ష్యంతో తీర్చి దిద్దానులే పరిసరాలే ౹2౹

శాఖాభివృద్దిలో నా మద్దతుకూడ ఎంతో

ఆఒక్క ఘనతకోసం చేసాను గతమెంతో ౹ప౹



Rate this content
Log in