STORYMIRROR

VENKATALAKSHMI N

Abstract Inspirational Others

4  

VENKATALAKSHMI N

Abstract Inspirational Others

ప్రయాణం

ప్రయాణం

1 min
280

మునిగి పోతుందని

తెలిసి చేస్తున్న

పడవ ప్రయాణమే కదా

మన జీవనయానం

అలల లాంటి అలకలు

సుడులలాంటి ఎగుడుదిగుళ్ళు

ప్రయాణంతో పాటు పయనిస్తాయి

గవ్వలవంటి ప్రేమలు

ముత్యాల వంటి ఆప్యాయత లు

మనమే ఏరుకుంటూ

ఏటికి ఎదురీదడం నేర్వాలి

జీవన గమనంలో

జీవిత పోరాటంలో

అన్నిటినీ ఆస్వాదిస్తూ

సంసార సాగరాన్ని

ఆస్వాదిస్తూ సాగాల్సిందే



Rate this content
Log in

Similar telugu poem from Abstract