ప్రయాణం
ప్రయాణం
ఓ మనిషీ!
ఎటు వైపు నీ పయనం..
స్వార్థపు రెక్కలు మొలిచిన దేహంతో..
అత్యాశపు అంగట్లో
ఆశలు ఆవిరవుతుంటే..
అన్యాయాన్ని ఎదిరించాల్సిన నల్లకోట్లు
అవకాశవాదులై మనుగడను
ప్రశ్నిస్తుంటే..
ఊపిరి పోయాల్సిన ప్రాణదాతలు
నోట్లకట్టలకు తలవంచి నిలదీస్తుంటే..
మాయ కమ్మిన కర్ణభేరి త్వచానికి
మగువల ఆర్తనాదాలు అరణ్యరోదనలవుతుంటే..
నగరీరీకరణ మోజులో
పుట్టి పెరిగిన పల్లెటూళ్ళు బోసిపోయి నిలుస్తుంటే..
మాయాపొరలు కమ్మిన
మానవ నేత్రాలకు
మాతృదేశపు మమకారం ఎండమావి అవుతుంటే..
బంధాలకు అనుబంధాలకు తిలోదకాలిచ్చి
రాగద్వేషాలతో రగులుతున్న నేటి సమాజంలో ఓ మనిషీ!
ఎటువైపు నీ పయనం ?
ఎందాక నీ ప్రయాణం?
