STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ప్రవాహం

ప్రవాహం

1 min
6


అదో నిగర్వ గంభీర‌ హృదయ 
సంగీత‌ సాగరం,లోలోతుల్లోనే  
జీవన జీవ ప్రవాహం,
ఉరుకులు,పరుగులు అసలెరుగదు
నురుగుల మెరుగులు వయ్యారాలను 
ఎన్నడూ ప్రదర్శించదు,
తానొక అర్థం కాని నిరాడంబర అంబరం

ఎవరికెరుక తానూ ఓ ఎత్తైన 
వైభోవోపేత కనుమలలో ఉదయించిదని ,
ఎవరికెరుక లోతైన లోయల్లోకి జలపాతంలా 
కొంటెగా గెంతులు వేసిందని,
గాఢాంధకార ఇరుకు అడవులను ఛేదించుకుని 
సన్నటి ప్రవాహమై తన లక్ష్యాలను చేరుకుందని,
తుఫానులు వెరవక,అడ్డు తగిలిన కొండలను
 చాకచక్యంతో నెట్టుకొచ్చిందని

ఏ అమృతం తాగిందో,
ఏ మహర్షి దివ్య సందేశం అవపోసన పట్టిందో ,
ఎన్ని సుడులు,ముడులు గల జీవన కెరటాల 
సారాంశాన్ని తన జీవిత పాఠంగా మార్చుకుందో మరి,
ఎన్నడూ ప్రశాంత జీవన వాహినిలాగే సాగిపోతుంది

నిండైన నది తాను లోతైన
ప్రవాహాలను ఆకళింపు చేసుకుంటూ;
దాహం లేదు,దర్పం లేదు,
ఉవ్వెత్తున ఎగిరే హంగు రంగుల
ఆర్భాటమే కానరాదు,
పదుగురికి సాయం చేస్తూ,
ప్రవహించడమే‌ తెలుసు,
అవును, జీవన పోరాట యుద్ధంలో 
నిశబ్ద గంభీర నాదమే తన ఆయుధం
అందుకే ఆమె నర్మ గర్భంగా సాగే 
ఓ మహత్తర జీవ అక్షౌహిణి


Rate this content
Log in

Similar telugu poem from Classics