ప్రతిఫలం
ప్రతిఫలం


ప౹౹
వలపనే గాలాల ప్రతిఫలము ఆ వగపేనా
తలపునే నమ్మినా తనదీ ఒట్టి పిలుపేనా౹2౹
చ౹౹
పగిలిన అద్దం ప్రతిఫలించునే కొంచెమైనా
రగిలిన గుండెలే ప్రేమించలేవ రవ్వంతైనా౹2౹
భగ్న హృదయమే భరించునా ఎడబాటు
నిర్విఘ్న వలపు వ్రతమే చెందే తడబాటు
౹ప౹
చ౹౹
కలసిలేకుంటే ఈఎదమొత్తము కలవరమే
అలసిపోయి ఆ కథ మొత్తము పలవరమే౹2౹
చిరు చలి హేమంతం చిరు నవ్వే పంచగా
చిగురించని ప్రేమలో చింతలే నీవే పెంచగా ౹ప౹
చ౹౹
ఒకనాటి ప్రమాణాలు ఒట్టి పోవలసిందేనా
ఏకసాటి సరసాలే సాగిలి పడవలసిందేనా౹2౹
వరించిన వలపునకు మిగిల్చేది ఎడారేనా
సవరించిన ఆశలతో కనులకూ పొడారేనా ౹ప౹